ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. వారికి రూ.2 లక్షల వరకు రుణం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి
ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. వారికి రూ.2 లక్షల వరకు రుణం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం దశల వారీగా రూ.5 లక్షలు అందిస్తోన్న విషయం తెలిసిందే.. పునాది వరకు నిర్మిస్తేనే మొదటి విడత సాయంగా రూ.లక్ష రూపాయలు ఇస్తోంది. ఆర్థిక సమస్యలతో కొందరు పునాది కూడా నిర్మించలేకపోతున్నారు. కొందరైతే మంజూరైన పత్రాలను కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. దీంతో చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి ముందడుగు వేస్తున్నారు.
ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందిస్తోంది. సంఘాల్లో అప్పుల్లేని సభ్యులు బ్యాంక్ లింకేజీ, సీఐఎఫ్, శ్రీనిధి ద్వారా ఈ మొత్తాన్ని పొందవచ్చు. ఇప్పటికే పలువురికి రుణాలు కూడా మంజూరయ్యాయి. చాలా మంది 12 లేదా 14 నెలల వాయిదా రుణం చెల్లించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మహిళా సంఘాల్లో అప్పులేని వారికి, అర్హతను బట్టి బ్యాంకులు రుణాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 1.74 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.