రోడ్డుపై మద్యం బాటిళ్లు.. ఎగబడ్డ జనం

బోయిన్‌పల్లిలో బుధవారం మధ్యాహ్నం మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న డీసీఎం వాహనానికి ప్రమాదం జరిగింది

By Medi Samrat  Published on  23 May 2024 1:09 PM IST
Liquor, van, accident,

రోడ్డుపై మద్యం బాటిళ్లు.. ఎగబడ్డ జనం 

బోయిన్‌పల్లిలో బుధవారం మధ్యాహ్నం మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న డీసీఎం వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అన్నది కూడా పట్టించుకోలేదు జనం. కేవలం బాటిళ్లను తీసుకుని వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. వాహనం అదుపు తప్పి పక్కకు పల్టీలు కొట్టడంతో ప్రమాదానికి గురైంది. బాటసారులు రోడ్డుపై పడిన బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయారు. బంజారాహిల్స్‌కు వెళ్తున్న వాహనం మిలటరీ డెయిరీ ఫామ్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి పడిపోయింది.

డ్రైవర్, క్లీనర్ అదృష్టవశాత్తూ ప్రమాదం నుండి బయటపడ్డారు. వాహనం బోల్తా పడి పలు డబ్బాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాద వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం బాటిళ్లను దోచుకెళ్లారు. బీర్, ఇతర మద్యం సీసాలను స్థానికులు పట్టుకెళ్ళిపోయారు. కిందపడిపోయిన వాటిలో ఎక్కువ భాగం చీప్ లిక్కర్ అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లియర్ చేశారు.

Next Story