మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్..రేపు లిక్కర్ షాపులు బంద్
హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik
మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్..రేపు లిక్కర్ షాపులు బంద్
హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలై 20 (ఆదివారం) ఉదయం 6 గంటల నుండి జూలై 21 (సోమవారం) ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయని కమిషనర్ ఉత్తర్వులో తెలిపారు .
కాగా రేపు హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ జరగనుంది. ఆషాఢమాసం చివరి ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింహవాహిని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
గత నెల 26 తేదీన గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. తర్వాత జులై 1 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13వ తేది ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సిటీలో నిర్వహించారు. అయితే రేపు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.