ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి హ‌రీశ్ రావు

Let's make Edupayala tourist spot says Minister Harish Rao.తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ప్ర‌తి సంవ‌త్స‌రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 7:31 AM GMT
ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌న దుర్గా ఆల‌యానికి నిధులు కేటాయిస్తున్న‌ట్లు మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. మెద‌క్ జిల్లా ఏడు పాయ‌ల ఆల‌యంలో మ‌హా శివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌భుత్వం త‌రుపున వ‌న‌దుర్గాదేవి అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

అంత‌క‌ముందు మంత్రి హ‌రీశ్‌రావుకు ఆల‌య పండితులు పూర్ణ కుంభంతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారి స‌న్నిధిలో మంత్రి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి మ‌హా శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ప్ర‌తి సంవ‌త్స‌రం ఏడుపాయలకు నిధులు కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. భ‌క్తుల కోర్కెల తీర్చే కొంగు బంగారం అమ్మ‌వారు అని అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మ‌రింత ముందుకు సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు.యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దామని, కొండగట్టు అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌లో దేవాల‌యాల అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. వేద పండితుల‌, బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. హిందుధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం పాటు పడుతుందని, రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామ‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

Next Story