కోస్గిలో చిరుత పులుల కలకలం

Leopards in narayanpet district kosgi. అడ‌వుల నుంచి దారిత‌ప్పి చిరుత పులులు జ‌నావాసాల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు

By అంజి  Published on  17 July 2022 7:51 AM GMT
కోస్గిలో చిరుత పులుల కలకలం

అడ‌వుల నుంచి దారిత‌ప్పి చిరుత పులులు జ‌నావాసాల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో పెద్ద‌పులులు సంచ‌రిస్తున్న‌ట్లు అధికారులు ఆన‌వాళ్ల‌ను గుర్తించారు. చిరుత పులులు కూడా సంచ‌రిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు మ‌రింత ఆందోళనకు గుర‌వుతున్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గిలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. కోస్గి సమీపంలో ఉన్న తిమ్మప్ప గుట్టపై రెండు చిరుత పులులు మకాం వేశాయి. స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

రాత్రి పూట చుట్టు పక్కల గ్రామాల్లోని కుక్కలు, గొర్రెలను చంపేస్తున్నాయి. పులులు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుతలు సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు ఫారెస్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత తొందరగా పులులను పట్టుకోవాలని కోరుతున్నారు. కాగా, చిరుత పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాయంత్రం వేళ ప్రజలు ఒంటరిగా బయట తిరుగొద్దని చెప్పారు.

Next Story
Share it