తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి హాలిడేస్ ఇచ్చారు. స్కూళ్లకు మాత్రం 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంపై ఇంటర్ పలు లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు అని, అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరోవైపుప ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు రేపటి నుంచి హాలిడేస్ రానున్నాయి. గాంధీ జయంతి కావడంతో ఇవాళ కూడా సెలవే.
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వాలని విద్యార్థులు, లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకూ దసరా సెలవులు ఇచ్చినా, ప్రైవేట్ కాలేజీలకు 3, 4, 5 తేదీల్లో క్లాసులు నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల మధ్య తేడా ఎందుకని, ఇవాళ్టి నుంచే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి.