వైభవంగా లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు

హైదరాబాద్‌లో పాతబస్తీ లాల్‌ద‌ర్వాజా సింహవాహిని మ‌హాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభ‌మైంది

By Knakam Karthik
Published on : 20 July 2025 10:42 AM IST

Hyderabad, Laldarwaja Bonalu, Mahakali Bonalu, Bonalu Festival

వైభవంగా లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు

హైదరాబాద్‌లో పాతబస్తీ లాల్‌ద‌ర్వాజా సింహవాహిని మ‌హాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభ‌మైంది. ఉద‌యం అమ్మ‌వారికి కుమ్మ‌రి బోనం స‌మ‌ర్పించారు. బోనాల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు తెల్ల‌వారుజాము నుంచే భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆల‌యం వ‌ద్ద నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్ర‌త్యేకంగా ఒక క్యూలైన్ ఉంది. అలాగే భ‌క్తుల కోసం రెండు మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

Next Story