దేశ గతిని మార్చే రాష్ట్రం తెలంగాణ.. రూ.14 లక్షల కోట్ల ఆస్తులు: కేటీఆర్‌

ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ నేడు.. ఉజ్వల తెలంగాణా వెలుగుతుందనే మాట వాస్తవం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

By అంజి  Published on  31 July 2024 5:45 AM GMT
KTR, Telangana properties, assembly

దేశ గతిని మార్చే రాష్ట్రం తెలంగాణ.. రూ.14 లక్షల కోట్ల ఆస్తులు: కేటీఆర్‌

ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ నేడు.. ఉజ్వల తెలంగాణా వెలుగుతుందనే మాట వాస్తవం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొంత మంది తెలంగాణ విఫల రాష్ట్రం అవుతుందని అన్నారు. అలాంటి శాపాలను తట్టుకుని, అనేక సవాళ్లను అధిగమించి తెలంగాణ సిరి సంపదలతో, భారతదేశ భాగ్యరేఖలు మార్చే రాష్ట్రంగా ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్న కేటీఆర్‌.. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేస్తే, రూ.14 లక్షల 60 వేల కోట్ల ఆస్తులు పెంచామని చెప్పారు. తీర్చే సత్తా ఉందని నమ్మితేనే.. బ్యాంకులు అప్పులు ఇస్తాయన్నారు.

రాష్ట్రం దివాళా తీసిందని ప్రభుత్వం అంటే.. కనీసం హవాలా వ్యాపారులు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోరని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. పదేళ్ల క్రితం కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. తెలంగాణ చీకట్లతో నిండిపోతుందని చెప్పారని, తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అని ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది అన్నారని గుర్తు చేశారు. పదేళ్లలో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చాక.. మాట మారుస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

Next Story