మా ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వండి

KTR urges PM to declare Kaleshwaram or Palamuru national project.తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2021 3:01 AM GMT
మా ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వండి

తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా క‌ల్పించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వరం లేదా పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌లో ఒక‌దానికి జాతీయ హోదా ఇచ్చి.. ఇత‌ర ప్రాజెక్టుల మాదిరి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పోలవ‌రం, క‌ర్ణాటక రాష్ట్రంలోని ఎగువ భ‌ద్ర ప్రాజెక్టుల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌తనే తెలంగాణ‌లోనే కాళేశ్వ‌రానికి ఇవ్వాల‌న్నారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే కేంద్రానికి అనేక సార్లు సీఎం కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని గుర్తు చేశారు.

అంతేకాకుండా.. రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఆదేశించాలని కోరారు. ఈ నెల 6న జరిగే భేటీలో ప్రాజెక్టులపై చర్చించేలా కమిటీని ఆదేశించాలని ప్రధానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు పలు ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించిన అంశంపై కొన్ని పేపర్ క్లిప్పింగులను కూడా మంత్రి తన ట్వీట్‌లో పోస్టు చేశారు.

Next Story
Share it