వచ్చే ఐపీఎల్ సీజన్‌కు వేదిక‌గా హైదరాబాద్‌ను కూడా ఎంపిక చేయండి

KTR Request To BCCI. ఐపీఎల్ వేదికలలో హైద్రాబాద్ లేద‌న్న‌ వార్తలపై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ స్పందించారు.

By Medi Samrat  Published on  28 Feb 2021 8:56 AM GMT
KTR Request To BCCI

ఐపీఎల్ వేదికలలో హైద్రాబాద్ లేద‌న్న‌ వార్తలపై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ స్పందించారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు హైదరాబాద్‌ను వేదిక‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని బీసీసీఐ, ఐపీఎల్‌‌ ప్రతినిధులను ట్విటర్ వేదికగా కేటీఆర్ కోరారు. హైద్రాబాద్‌లో కోవిడ్ ప్రభావం అధికంగా లేదనడానికి ఇక్కడ నమోదవుతున్న తక్కువ కేసులే నిదర్శనమన్నారు.


మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లో కేసులు తక్కువ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయ‌న‌ ట్వీట్ చేశారు. ఇదిలావుంటే.. గత ఐపీఎల్‌కు దుబాయ్ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి లీగ్ భారత్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలను వేదికలుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా నిబంధనలకు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ వార్త‌ల నేఫ‌థ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.


Next Story
Share it