ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం : కేటీఆర్
బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సమర్ధవంతమైన నాయకుడని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 20 April 2024 3:04 PM ISTబీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సమర్ధవంతమైన నాయకుడని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రవీణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని నాగర్‌కర్నూల్ ప్రజలు బలపరచాలని.. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గళం వినిపించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో కేటీఆర్ ఒక పోస్టులో ఆయన గురించి ప్రస్తావిస్తూ.. ప్రవీణ్ కుమార్ వంటి సమర్థ నాయకుడు రాష్ట్రానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని.. ఆయన రాష్ట్ర సమస్యలను లోక్‌సభలో మరింత మెరుగ్గా, మరింత ప్రభావవంతంగా లేవనెత్తగలడని పేర్కొన్నారు.
🔷 మన బీఆర్‌ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
— KTR (@KTRBRS) April 20, 2024
🔹సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
🔹నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు… pic.twitter.com/rRv74Ludan
తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో గురుకుల విద్యా విప్లవంలో ప్రవీణ్‌కుమార్ పోషించిన పాత్ర అమోఘమని కొనియాడారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా అనేక మంది బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ప్రతిష్టాత్మక పాఠశాలల్లో సీట్లు పొందేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించేందుకు తోడ్పాటు అందించారని గుర్తు చేశారు.
నల్లమల ప్రాంతంలో జన్మించిన ప్రవీణ్‌కుమార్.. తన ఆరేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడి ప్రజాసేవలో అడుగుపెట్టారు. పోలీసు అధికారి అయిన ఆయన తన పదవీ కాలంలో పోలీసు వ్యవస్థలో అనేక వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రెండ్లీ పోలీసింగ్‌కు మార్గదర్శకుడిగా ఉన్నారన్నారు. ప్రవీణ్ కుమార్ ప్రజా సంక్షేమం కోసం చాలా చొరవ తీసుకున్నారని, రాష్ట్రపతి అవార్డు, ఐక్యరాజ్యసమితి పోలీసు పతకం, పోలీసు గ్యాలంట్రీ వంటి అనేక అవార్డులు అందుకున్నారని గుర్తు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు.