బండి సంజయ్- ప్రవీణ్ కుమార్‌కు వైట్ ఛాలెంజ్ విసిరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Konda Vishweshwar Reddy On White Challenge. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  20 Sep 2021 8:34 AM GMT
బండి సంజయ్- ప్రవీణ్ కుమార్‌కు వైట్ ఛాలెంజ్ విసిరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి రేవంత్ రెడ్డి ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారు. ఈ మేర‌కు గన్ పార్క్ ద‌గ్గ‌ర జ‌రిగిన కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వైట్ ఛాలెంజ్ అనేది సమాజానికి మంచిదని అన్నారు. రేవంత్ ఛాలెంజ్ స్వీకరించి వస్తే కేటీఆర్ తన స్థాయి మరింత పెరిగేదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మా స్థాయి వేరు అని రాజకీయ నేతలు మాట్లాడొద్దని.. పెద్ద రాజకీయ నేతలు - చిన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతారని అన్నారు.

సైదాబాద్‌ సింగరేణి కాల‌నీ ఘటన డ్రగ్స్ వల్లనే అయ్యింద‌ని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి లీడర్ కు డ్రగ్ టెస్ట్ తీసుకోవాలని.. డ్రగ్ టెస్ట్ తీసుకున్న తరువాతే ఎన్నికల్లో నిలబడే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్, రాహుల్ గాంధీ గురించి తొందరపాటులో మాట్లాడుతున్నారని.. ఈ ఇస్యూకు, రాహుల్ కు సంబంధం లేదని.. డ్రగ్ ఇస్యూ రాష్ట్రానికి చెందిన సమస్యని అన్నారు. ఈ సంద‌ర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బండి సంజయ్- ప్రవీణ్ కుమార్‌కు వైట్ ఛాలెంజ్ విసిరారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఇదిలావుంటే.. డ్రగ్స్ వ్యవహారంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ లో గొడవ జరుగుతూ ఉంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.. మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ''నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను.. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?.. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ.. ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా'' అని సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Next Story