అప్పుల కోసమేనా.. తెలంగాణ సాధించుకుంది?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా
By అంజి Published on 2 Jun 2023 4:45 AM GMTఅప్పుల కోసమేనా.. తెలంగాణ సాధించుకుంది?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్న ఎగరవేసిన మంత్రి కిషన్.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ''ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం అమరులైన వారిని నేడు స్మరించుకుందాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు'' అని కిషన్‌రెడ్డి అన్నారు. దివంగత బీజేపీ జాతీయ నాయకురారలు సుష్మాస్వరాజ్‌కు నివాళులు అర్పించిన మంత్రి కిషన్‌రెడ్డి.. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నది బీజేపీ విశ్వాసమని చెప్పారు. కిషన్ రెడ్డి ఇంకా ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబపాలనతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని ఆరోపించారు.
ఓ కుటుంబానికి తెలంగాణ బానిసగా మారే పరిస్థితి వచ్చిందని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది అప్పుల కోసమా? అంటూ ప్రశ్నించారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప డబుల్ బెడ్‌రూంలు ఇవ్వట్లేదని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు పథకంలో అవినతీతి, ఆరోగ్యశ్రీ, తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటన్నారు. ఉద్యమం ద్రోహులకు ప్రభుత్వంలో పెద్దపీట వేశారని, అధికారంలో ఉన్న పార్టీ నేతల కుటుంబాలు బంగారంగా మారాయన్నారు. దేశంలో ఆదర్శవంతమైన, నీతివంతమైన పాలన అందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.