ఆర్టీసీ సేవలపై మొగులయ్య కిన్నెర పాట.. వీడియో వైరల్.!

Kinnera player mogulayya sings a song on RTC services. ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య.. తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ పాట పాడారు. ఆర్టీసీ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

By అంజి  Published on  22 Nov 2021 7:35 AM GMT
ఆర్టీసీ సేవలపై మొగులయ్య కిన్నెర పాట.. వీడియో వైరల్.!

ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య.. తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ పాట పాడారు. ఆర్టీసీ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఆర్టీసీ బస్సు ముందు తనదైన శైలిలో ఆర్టీసీ సేవలపై పాట ఆలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల మొగులయ్య తన కుమార్తె పెళ్లి కోసం ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకున్నాడు. ఆర్టీసీ అందించిన సేవలకు మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను అద్దెకు తీసుకున్న బస్సు ముందు పాట పాడారు.

బుక్‌ చేసుకున్న గంటలోనే బస్సు వచ్చిందని.. చుట్టాలు, పిల్లలు అందరూ బస్సు ఎక్కి పెళ్లికి మంచిగా వెళ్లి వచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చెప్పలేని ఆనందాన్ని కలిగించిందన్నారు. అది బస్సంటే బస్సు కాదని.. తల్లిలాంటిదని మొగులయ్య అన్నారు. ఈ సందర్భంగా అందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని మొగులయ్య పిలుపునిచ్చారు. పాట చివరలో శభాష్‌ సజ్జనార్‌ సార్‌ అంటూ ముగించారు. ప్రస్తుతం మొగులయ్య పాట పాడిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆర్టీసీ సంస్థ పెళ్లిళ్లకు, తీర్థ, విహార యాత్రలకు, ప్యాకేజీ టూర్లకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండా బస్సులను బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.


Next Story
Share it