ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్‌లో ఈ నెల 13 వరకు పలు రైళ్లు రద్దు
మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 7:49 AM IST
ప్రయాణికులకు అలర్ట్..ఆ రూట్‌లో ఈ నెల 13 వరకు పలు రైళ్లు రద్దు
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ జాఫర్ తెలిపారు. గుంటూరు, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
దారి మళ్లించిన రైళ్లలో విశాఖ-న్యూఢిల్లీ, విశాఖ-గాంధీధామ్, హైదరాబాద్-షాలీమార్, ముంబై-భువనేశ్వర్, షిర్డీ-కాకినాడ, షిర్డీ-మచిలీపట్నం, ఎర్నాకుళం-బరౌనీ రైళ్లు ఉన్నాయి. అలాగే, రద్దయిన రైళ్లలో డోర్నకల్-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్, గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, ఇండోర్-కొచ్చివెల్లి, కోర్బా-తిరువనంతపురం, గోరఖ్‌పూర్-కొచ్చివెల్లి, హిస్సార్-తిరుపతి రైళ్లు ఉన్నాయి. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైళ్లను రేపటి నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేశారు.
రైలు నంబర్ పేరు / మార్గం రద్దయిన తేదీలు
67767 డోర్నకల్ - విజయవాడ (పుషుల్)
67768 విజయవాడ డోర్నకల్
67215 విజయవాడ భద్రాచలం రోడ్
67215 భద్రాచలం రోడ్ విజయవాడ
12705 గుంటూరు-సికింద్రాబాద్ (ఇంటర్ సిటీ)
12706 సికింద్రాబాద్- గుంటూరు (ఇంటర్ సిటీ)
12713 విజయవాడ - సికింద్రాబాద్ (శాతవాహన)
12714 సికింద్రాబాద్ విజయవాడ (శాతవాహన)
12701 గుంటూరు - సికింద్రాబాద్ (గోల్కొండ)
12702 సికింద్రాబాద్ గుంటూరు (గోల్కొండ)
07481 తిరుపతి - సికింద్రాబాద్ (స్పెషల్) ఈనెల 9న
07482 సికింద్రాబాద్ తిరుపతి (స్పెషల్) ఈనెల 10న
22645 ఇండోర్ కొచివిల్ ఈనెల 10న
22646 కొచివిల్ ఇండోర్ ఈనెల 8న
22647 కోర్బా - కొచివిల్ ఈనెల 12న
22648 కోచివిల్ కోర్బా ఈనెల 10న
12511 గోరఖ్ పూర్ కోచివిల్ (రప్తీసాగర్) ఈనెల 6, 7, 9
12512 కోచివిల్ - గోరఖ్పూర్ (రప్తీసాగర్) ఈనెల 9, 11, 12
04717 హిస్పార్-తిరుపతి (స్పెషల్) ఈనెల 8న
ఆదాయం 10 లక్షలు కంటే ఎక్కువ? ఈ టర్మ్ ప్లాన్ చూడండి.
07418 తిరుపతి-హిస్సార్ (స్పెషల్) ఈనెల 10న