హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యదర్శి దేవరాజ్, శ్రీనివాసరావును పదవుల నుంచి హెచ్‌సీఏ తొలగించింది. జులై 28న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌సీఏ ప్రకటన విడుదల చేసింది. నిధుల దుర్వినియోగం. మోసం, అధికార బలపై దుర్వినియోగ ఆరోపణలతో వారిని తప్పించినట్లు పేర్కొంది. సీఐడీ, ఈడీ ఆరోపణలపై కూడా దర్యాప్తు చేపట్టినట్లు హెచ్‌సీఏ వెల్లడించింది. హెచ్‌సీఏ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. పారదర్శకత, నైతిక విలువులకు కట్టుబడి ఉన్నామని హెచ్‌సీఏ కౌన్సిల్ స్పష్టం చేసింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే చర్యలు తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.
నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై జగన్మోహన్‌రావుతో పాటు కార్యదర్శి ఆర్. దేవరాజ్, కోశాధికారి సి.జె. శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్ కాంత్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య జి. కవితలను తెలంగాణ సీఐడీ ఇటీవల అదుపులోకి తీసుకుంది. వారిపై సెక్షన్ 465 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ), 471 (ఫోర్జరీ చేసిన పత్రాన్ని ఉపయోగించడం), 403 (ఆస్తిని అక్రమంగా వినియోగించుకోవడం), 409 (పబ్లిక్ సర్వెంట్ ద్వారా క్రిమినల్ నమ్మక ద్రోహం), 420 (మోసం) కింద కేసులు నమోదయ్యాయి.