హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డుదారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తం చేసింది. ఈ–కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని, కార్డులు రద్దవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు
e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.