ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By - Knakam Karthik |
ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో "బుల్‌డోజర్ రాజ్" నడుస్తోందని, ముందస్తు నోటీసులు లేకుండా వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేయడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని వినోబా నగర్‌లో భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 700 ఇళ్లను ఫిబ్రవరి 25 తెల్లవారుజామున కూల్చివేశారని, దీనివల్ల దాదాపు 3,000 మంది రోడ్డున పడ్డారని ఆయన పేర్కొన్నారు.
వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమం ద్వారా భూమి లేని పేదలకు కేటాయించిన స్థలాల్లోనే ఈ ఇళ్లు ఉన్నాయని విజయన్ తెలిపారు. కేరళ ప్రభుత్వం భూమి లేని వారికి పట్టాలు ఇచ్చి యజమానులను చేస్తుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదలను ఖాళీ చేయిస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలోని యలహంక, తెలంగాణలోని ఖమ్మం ఘటనలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఉత్తరాది బీజేపీ రాష్ట్రాల విధానాలనే అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు. వాయనాడ్ కొండచరియల విపత్తు బాధితులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
The demolition of nearly 700 Bhoodan-allotted homes in Khammam, leaving around 3,000 people homeless, exposes the Congress government’s true face in Telangana. This ‘bulldozer raj’ mirrors the BJP’s model of using state power against the poorest.The Congress leadership in…
— Pinarayi Vijayan (@pinarayivijayan) March 2, 2026