ఏడాదిలోగా కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on  5 Dec 2023 6:47 AM IST
KCR, CM, BRS MLA, Kadiyam Srihari

ఏడాదిలోగా కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘోర పరాజయం తర్వాత జనగాం జిల్లా ఘన్‌పూర్‌ స్టేషన్‌లో పార్టీ శ్రేణులను ఓదార్చిన పార్టీ నేత కడియం శ్రీహరి.. ఒక్క ఏడాది లేదా ఆరు నెలల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అధైర్యపడవద్దని సూచించారు. ఆనందోత్సాహాల మధ్య శ్రీహరి మాట్లాడుతూ, “ఇప్పుడు మనం అధికారంలో లేకుంటే భయపడకండి. ఆరు నెలల తర్వాతైనా, ఏడాదికో లేదంటే రెండేళ్లకో కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు’’ అని అన్నారు.

''కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చాయి. మరి వాళ్లు కాపాడుకుంటారో లేదో చూడాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజల తీర్పును మనమంతా స్వాగతించాలి. ఇకపోతే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది'' అని కడియం శ్రీహరి అన్నారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరాపై 40,051 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 3న మెజారిటీతో గెలుపొందడం ద్వారా బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనను ముగించింది. గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోగా.. గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు.

Next Story