నేడు జ‌గిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

KCR to tour Jagtial district today.సీఎం కేసీఆర్ బుధ‌వారం జ‌గిత్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 2:33 AM GMT
నేడు జ‌గిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

సీఎం కేసీఆర్ బుధ‌వారం జ‌గిత్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. జ‌గిత్యాల‌లో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించ‌నున్నారు.

సీఎం ప‌ర్య‌ట‌న షెడ్యూల్..

- మ‌ధ్యాహ్నాం 12:40 గంటలకు జ‌గిత్యాల‌లో నూత‌నంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

- మ‌ధ్యాహ్నాం 1గంట‌కు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.510 కోట్ల‌తో 27 ఎక‌రాల్లో ప్ర‌భుత్వం మెడిక‌ల్ కాలేజీని నిర్మించ‌నుంది.

- మధ్యాహ్నం 1:15కు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం జిల్లా అధికారులతో స‌మావేశం కానున్నారు.

- మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ నుంచి బయలు దేరి 3:10 గంటల వరకు మోతె శివారులోని బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్ర‌సంగించ‌నున్నారు.

- బ‌హిరంగ స‌భ అనంత‌రం హెలికాఫ్ట‌ర్‌లో ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌస్‌కు వెళ్ల‌నున్నారు.

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జ‌గిత్యాల ప‌ట్ట‌ణం అంతా గులాబీమ‌యంగా మారింది. ఎక్క‌డ చూసినా పార్టీ జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి. ప్ర‌ధాన ర‌హ‌దారులు ఫ్లెక్సీల‌తో నిండిపోయాయి. నూత‌న క‌లెక్ట‌రేట్‌ను అందంగా ముస్తాబు చేశారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Next Story