అప్పుడు నన్ను బెదిరించారు.. కానీ..

KCR Speech In Nagarjuna Sagar Meeting. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో బుధవారం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరిగింది.

By Medi Samrat  Published on  14 April 2021 9:09 PM IST
KCR

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో బుధవారం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు తనకు ధన, గుండాల, తండాల, మీడియా బలం లేదన్నారు. హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేసి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు వెళితే అక్కడి డాక్టర్లు తనను బెదిరించారని చెప్పారు. నిరహార దీక్ష విరమించకపోతే కోమాలోకి పోతావని, చచ్చిపోతానని డాక్టర్లు అన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆత్మ బలంతో అడుగు ముందుకేసినట్లు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో దీక్ష చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆ దీక్షనే ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిందని కేసీఆర్ అన్నారు.

అనంత‌రం నోముల భగత్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి నోముల‌ న‌ర్సింహ‌య్య చేస్తానన్న కృషిని సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో తాను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 17న జరిగే నియోజకవర్గ ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి తనని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో 2018లో మా నాన్న నోముల నర్సింహాయ్య ఇదే వేదికగా మీ అందరి ముందుకు వచ్చి ఆశీస్సులు కోరారు. భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నోసార్లు అసెంబ్లీ లోపల కావొచ్చు, బయట కావొచ్చు ఏ విధంగా పాటుపడ్డారో మీ అందరికీ తెలిసిందే. గత 35 ఏళ్లుగా జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ సహకారంతో చేసి చూపిస్తానని చెప్పారు. మా నాన్నగారు నియోజకవర్గ అభివృద్ధికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో నెరవేరుస్తా. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే.. తప్పకుండా ఇక్కడున్న పెద్దలందరికీ ఒక కొడుకు లాగా, అక్కలు, అన్నలందరికీ ఒక తమ్ముడిలాగా సేవ చేసుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్‌ అని తన ప్రసంగాన్ని ముగించారు.




Next Story