కేసీఆర్‌ సీఎం మెటీరియల్‌ కాదు.. పీఎం మెటీరియల్‌: ప్రకాష్‌ రాజ్‌

కేసీఆర్‌ ముఖ్యమంత్రి మెటీరియల్‌ కాదని.. ప్రధానమంత్రి మెటీరియల్‌ అని ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కొనియాడారు.

By అంజి  Published on  15 Nov 2023 10:34 AM IST
KCR, CM material, PM material, Prakash Raj, Telangana Polls

కేసీఆర్‌ సీఎం మెటీరియల్‌ కాదు.. పీఎం మెటీరియల్‌: ప్రకాష్‌ రాజ్‌ 

కేసీఆర్‌ ముఖ్యమంత్రి మెటీరియల్‌ కాదని.. ప్రధానమంత్రి మెటీరియల్‌ అని ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కొనియాడారు. తాను సీఎం కేసీఆర్‌ను ఎంతో గౌరవిస్తానని అన్నారు. కేసీఆర్‌ అనుభవం, ఆలోచనలు ఈ దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మిషన్‌ కాకతీయ, హరితహారం, కంటి వెలుగు లాంటి ఎన్నో గొప్ప పథకాలను తీసుకొచ్చారని ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ గురించి ఎవరైనా ఆలోచించారా? వాటిలో అవినీతి జరిగితే మోదీ చేతిలో ఉన్న ఈడీ ఎందుకు అరెస్టు చేయట్లేదు? అని ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యానించారు.

అలాగే తాను ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొననని, అది తనకు ఇష్టం లేదని, అలా పాల్గొనమని కేసీఆర్, కేటీఆర్ కూడా తనను కోరరని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజకీయాల పట్ల ముఖ్యంగా ప్రధాని మోదీ గురించి ఆయన చాలా కామెంట్లు చేశారు. భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ పట్ల ప్రకాష్ రాజ్ చాలా సానుకూలమైన, ప్రశంసాపూర్వకమైన కామెంట్లు కూడా చేశారు. రాహుల్ ఇప్పుడు గొప్ప పరిణతి సాధించిన నాయకుడిగా ఎదిగారని ఆయన పొగిడారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి పట్ల చాలా వ్యతిరేక భావాన్ని ప్రకాష్‌ రాజ్‌ వ్యక్తం చేశారు.

Next Story