కేసీఆర్ హెల్త్ బులెటిన్, మాజీ సీఎం హెల్త్‌పై సీఎం రేవంత్ ఆరా
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గత అర్ధరాత్రి తన ఫామ్ హౌస్‌లో జారి కిందపడిపోయారు.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 6:50 AM GMTకేసీఆర్ హెల్త్ బులెటిన్, మాజీ సీఎం హెల్త్‌పై సీఎం రేవంత్ ఆరా
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గత అర్ధరాత్రి తన ఫామ్ హౌస్‌లో జారి కిందపడిపోయారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆయన బాత్రూమ్‌లో కాలు జారిపడిపోయారు. అనుకోకుండా ఒక్కసారిగా కిందపడిపోవడంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ బాత్రూమ్‌లో జారిపడ్డారని తెలిపారు. దాంతో.. తదుపరి చికిత్స కోసం తమ ఆస్పత్రికి తీసుకొచ్చారని వెల్లడించారు. అయితే.. కేసీఆర్‌కు ఆస్పత్రిలో సీటీ స్కాన్‌తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు వైద్యులు. ఈ క్రమంలోనే తుంటి ఎముకకు గాయం అయినట్లు గుర్తించామన్నారు. అయితే.. హిప్ రీప్లేస్‌మెంట్ అవసరమని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తుంటి పగుళ్లను విడిచిపెట్టినట్లు (ఇంట్రాక్యాప్సులర్ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్) కొనుగొన్నామని చెప్పారు. ఎడమ తుంటిని భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా ఇలాంటి చికిత్స తర్వాత కోలుకునేందుకు ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు సమయం పడుతుందన్నారు.
అయితే.. కేసీఆర్‌ను ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ సహా ఇతర నిపుణుల బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. అలాగే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని కూడా చెప్పారు.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ జారిపడి ఆస్పత్రిలో చేరిన సంఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. దాంతో.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రిజ్వీ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయన్ని పరామర్శించారు. వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని రిజ్వీ సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. కేసీఆర్‌కు తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు రేవంత్‌రెడ్డికి చెప్పారు. అయితే.. కేసీఆర్ ఆరోగ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆస్పత్రిమాజీ సీఎం ఆరోగ్యం గురించి ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి pic.twitter.com/acrmuLmaBv
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 8, 2023