ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
Kalwakuntla Kavitha sworn in as MLC of Nizamabad Local Bodies. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం చేశారు.
By అంజి Published on
19 Jan 2022 9:30 AM GMT

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం నాడు మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ.. కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. కవిత ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అనంతరం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలు ఖాళీ కాగా.. వాటికి ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. ఆ 12 స్థానాల నుండి గెలిచిన వారి పదవీ కాలం జనవరి 5వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. 12 మందిలో కవిత, దామోదర్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. మరో 10 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం కేసీఆర్‌కు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Next Story