తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. డాక్టర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటళ్లలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు జూనియర్ డాక్టర్లు.
తమ వర్క్ ఎన్విరాన్‌మెంట్ మెరుగైందని, ప్రభుత్వం అన్ని రకాలుగా తమకు సహకరిస్తోందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామని లేఖలో వెల్లడించారు. గత పదేళ్లలో ఇలా ప్రభుత్వాన్ని అభినందిస్తూ లేఖ రాయడం ఇదే మొదటిసారని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు.