సంచలన ఇంటర్వ్యూల టిఎన్ఆర్ ఇక లేరు

Journalist TNR Passed Away. టిఎన్ఆర్ కరోనాతో చావు బతుకుల మధ్య పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

By Medi Samrat  Published on  10 May 2021 10:32 AM IST
TNR

యూ ట్యూబ్ లో 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ఎంతో పాపులర్..! ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రముఖులు కూడా టి నరసింహా రావు ను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమాల్లో కూడా ఆయన ఇటీవలే రాణిస్తూ వచ్చారు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు.

కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టిఎన్ఆర్ కరోనాతో చావు బతుకుల మధ్య పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని.. దాదాపు కోమాలో ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.

కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన టిఎన్ఆర్ వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన శరీరం కూడా వైద్యానికి రెస్పాండ్ కావడం లేదని.. అత్యంత విషమంగా ఉందని చెప్పిన వైద్యులు.. మరికొద్ది గంటల్లోనే తుదిశ్వాస విడిచారనే చేదు వార్తను తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





Next Story