తీన్మార్ మల్లన్న అరెస్ట్
Journalist Teenmaar Mallanna Arrested.జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2021 2:33 AM GMT
జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీర్మాన్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని.. ఇవ్వకపోతే తనపై తప్పుడ కథనాలు ప్రసారం చేసి తన పేరును దెబ్బతీస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కాగా.. గతంలో లక్ష్మీకాంతశర్మ సితాఫల్ మండిలోని మధురానగర్ లో నిర్వహిస్తున్న జ్యోతిష్యాలయంపై క్యూ న్యూస్ లో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి.