ఎంపీ అర్వింద్‌పై జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Jeevan Reddy Fire On MP Darmapuri Arvind. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

By M.S.R  Published on  20 Nov 2022 3:28 PM IST
ఎంపీ అర్వింద్‌పై జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ది ఫైట‌ర్స్ ఫ్యామిలీ అని.. అర‌వింద్‌ది ఛీట‌ర్స్ ఫ్యామిలీ అని విమర్శించాడు. అరవింద్ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడని.. అర‌వింద్ ఒక దొంగ అని విమర్శించారు. బ‌డికి పోయే వ‌య‌సులో బార్ షాపుల చుట్టూ తిరిగిన ఈ బ‌ట్టేబాజ్‌కు సంస్కారం ఎక్క‌డ్నుంచి వ‌స్త‌ద‌ని అర‌వింద్‌ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు జీవన్ రెడ్డి. అర‌వింద్ రాజ‌స్థాన్‌లో చ‌దువు ఒక ఫేక్. ప‌సుపు బోర్డు తెస్తాన‌ని రాసిచ్చిన బాండ్ పేప‌ర్ ఫాల్స్. ఆయ‌న చెప్పే మాట‌లు ఫ్రాడ్ అని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా ఎదుర్కొనే ద‌మ్ము, ధైర్యం లేక‌నే అర‌వింద్ బూతు పురాణాల‌కు దిగాడ‌ని.. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో క‌విత మాట్లాడార‌ని బీజేపీ బ్రోక‌ర్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ ఎంపీగా ఈ నాలుగేళ్లలో ఏం చేసాడో, ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.


Next Story