బర్రెలక్కను గెలిపించడం కోసం ప్రచారానికి ఎవరెవరు వచ్చారో తెలుసా.?

కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల ప్రచారానికి

By M.S.R  Published on  25 Nov 2023 7:28 PM IST
బర్రెలక్కను గెలిపించడం కోసం ప్రచారానికి ఎవరెవరు వచ్చారో తెలుసా.?

కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల ప్రచారానికి పలువురు ప్రముఖులు వస్తున్నారు. తాజాగా జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మద్దతు పలికారు. రాజకీయాల్లో యువత ముందుకు రావాలని, ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు జేడీ లక్ష్మీనారాయణ. దేశంలో చాలా పార్టీలు చాలామంది నాయకులు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, ఇలాంటి యువతకు అవకాశాలు ఇచ్చి సభల్లో కొత్త గొంతు వినపడేలా అవకాశం కల్పించాలని అన్నారు. అందుకే శిరీష కు మద్దతు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ కు చెందిన యానం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణారావు శిరీష కు ఆర్థిక సాయం చేశారని ఆమెకు మద్దతు తెలపటానికి ఇక్కడికి వస్తున్నారని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో శిరీష ఇంతవరకు రావడం హర్షించదగ్గ విషయమని.. ఇలాగే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో శిరీష ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి ఈలతో ప్రజలను మేల్కొల్పాలని జేడీ లక్ష్మీనారాయణ కోరారు. ఈల గుర్తు పై ప్రతి ఒక్కరూ ఓటు వేసి శిరీషను అసెంబ్లీకి పంపించాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

Next Story