ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' సృష్టికర్త అందెశ్రీ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఇవాళ తెల్లవారుజామున స్పృహా తప్పి పడిపోయారు. దీంతో కుటుంబీకులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో అందెశ్రీ బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా రేబర్తి. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న. 2006లో 'గంగ' సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితి పురస్కారం అందెశ్రీ అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం సాధించారు.