నేటి నుంచి 'జాగృతి జనం బాట'
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జనంబాట నేటి నుంచి ప్రారంభంకాబోతుంది
By - Knakam Karthik |
నేటి నుంచి 'జాగృతి జనం బాట'
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జనంబాట నేటి నుంచి ప్రారంభంకాబోతుంది. శనివారం ఉదయం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని కవిత నివాళులర్పిస్తారు. ఆ తర్వాత జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. వరుసగా నాలుగు నెలలపాటు కవిత ప్రజల్లోనే ఉంటూ ఈ యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర, జిల్లాలు, అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాలను కవిత శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు.
జాగృతి జనం బాట షెడ్యూల్
ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు.. గన్ పార్క్ వద్ద ఉదయం 9.30గంటలకు మీడియాతో మాట్లాడుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇందల్వాయి టోల్ గేట్ వద్ద తెలంగాణ జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈనాడు ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ తీస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు.. తెలంగాణ తల్లి వి గ్రహానికి నివాళులర్పించి.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు . మధ్యాహ్నం 4 గంటలకు నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటలకు నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.