జగిత్యాల జిల్లాలో మొసలి క‌ల‌క‌లం

Jagittala district News Update. జగిత్యాల జిల్లా వెల్గటూర్ వాగులో మొసలి కనిపించడం కలకలం రేపింది.

By Medi Samrat
Published on : 1 Aug 2023 3:30 PM IST

జగిత్యాల జిల్లాలో మొసలి క‌ల‌క‌లం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ వాగులో మొసలి కనిపించడం కలకలం రేపింది. వాగులో ఎక్కడి నుండి కొట్టుకువచ్చిందో ఏమో కానీ.. మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదల్లో మొసలి కొట్టుకుని వచ్చి వెల్గటూరు వాగులో కనిపించింది. వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులు మొసలిని చూసి పరుగులు తీశారు. మొసలి బరువు దాదాపు 100 కిలోల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. వాగులోకి వెళ్లకూడదని జాగ్రత్తగా ఉండాలన్న ఉండాలని రైతులకు స్థానికులు సూచిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో మొసలి క‌ల‌క‌లంజగిత్యాల జిల్లాలో ఓ భారీ మొసలి కనిపించడం కలకలం రేపింది. వెల్గటూర్ వాగులో పెద్ద మొసలి ఒకటి స్థానికులను భయపెట్టింది. పాషిగామా గ్రామానికి చెందిన రాజు అనే రైతుకు వాగులో వ్యవసాయ మోటార్ సెట్ చేస్తుండగా నీటిలో ఏదో వింత ఆకారం కనిపించింది. అయితే అక్కడ ఉన్నది మొసలి అని క్షణాల్లో అతడికి అర్థమైంది. దీంతో భయాందోళన గురైన ఆ రైతు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ మొసలి దాదాపు 150 కిలోలు పొడవు తొమ్మది అడుగుల వరకు ఉండవచ్చని రైతులు చెబుతున్నారు. వాగులోకి ఎవరూ వెళ్లకూడదని స్థానికులు హెచ్చిరించారు.

Next Story