ఆ ఇద్ద‌రినీ రాజ్య‌స‌భ‌కు పంపండి : జగ్గారెడ్డి

తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల విష‌య‌మై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌తో మాట్లాడాన‌ని.. వాటిని వీ హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌ల‌కు ఇవ్వాలని కోరాన‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 3:14 PM IST

ఆ ఇద్ద‌రినీ రాజ్య‌స‌భ‌కు పంపండి : జగ్గారెడ్డి

తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల విష‌య‌మై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌తో మాట్లాడాన‌ని.. వాటిని వీ హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌ల‌కు ఇవ్వాలని కోరాన‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. రాహుల్ గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గేనీ కలవడానికి ఢిల్లీ వచ్చాను.. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారు.. మల్లికార్జున ఖ‌ర్గేని కలిసి వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌ల‌కు రాజ్యసభ అవ‌కాశం ఇవ్వాలని.. వారికి రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరానని మీడియాతో అన్నారు.

జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ కమ్మ సామాజిక నుంచి ఉన్నాడు.. కమ్మ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరాను. ఆయ‌నది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, వాళ్ల‌ కుటుంబంలో మొద‌టి నుంచి అందరూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు

హనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేశారు.. మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారు. రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారు.. వయసులో పెద్ద వ్యక్తి, చురుకైన వ్యక్తి కాబట్టి మరో సారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఖర్గే కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారని.. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామ‌ని పేర్కొన్నారు.

Next Story