Jaggareddy : జడ్జి చెప్పాల్సిన జడ్జ్‌మెంట్ బీఆర్ఎస్ చెప్పింది
జడ్జి బెయిల్ ఆర్థర్ ఇవ్వకముందే.. మూడు రోజులుగా కేటీఆర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా హడావుడి చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు
By Medi Samrat Published on 27 Aug 2024 2:00 PM GMTజడ్జి బెయిల్ ఆర్థర్ ఇవ్వకముందే.. మూడు రోజులుగా కేటీఆర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా హడావుడి చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ వచ్చే ఎన్నికల లోపు విలీనం కావచ్చు.. లేదంటే పొత్తు పెట్టుకోవచ్చని జోస్యం చెప్పారు. బెయిల్ వస్తుంది అని ముందే చెప్పిన కేటీఆర్ పైనే కోర్టు చర్యలు తీసుకోవాలన్నారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకూ తెలియదు.. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి.. కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందన్నారు. కేటీఆర్ రెండు రోజుల ముందే డిల్లీలో హడావుడి చేశారని.. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేస్తుందన్నారు. మూడు రోజుల ముందే బెయిల్ వస్తుంది అని హడావుడి చేసినందుకు న్యాయవ్యవస్థ కేసీఆర్ కుటుంబం పై చర్యలు తీసుకోవాలన్నారు.
బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్ ఒప్పందాల్లో భాగంగానే బెయిల్ వచ్చిందన్నారు. జడ్జి చెప్పకముందే కేసీఆర్..కేటీఆర్.. హరీష్ లకు ముందు సమాచారం వచ్చిందని ఆరోపించారు. దేశంలో విచిత్ర పరిపాలన జరుగుతుందన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోయే దాంట్లో భాగమే లిక్కర్ కేసు అన్నారు.
బీజేపీ వ్యూహం ఏంటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. బీఆర్ఎస్‌ను కలుపుకునే పనిలో ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించిందన్నారు. కవిత బెయిల్ కండిషన్ లో భాగమే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారని.. మెదక్‌లో బీఆర్ఎస్ గెలుస్తది అనే పరిస్థితి నుంచి మూడో స్థానంకు ఎందుకు పోయిందని ప్రశ్నించారు. కవిత కోసం సొంత పార్లమెంట్ నియోజక వర్గం కేసీఆర్ వదిలేసుకున్నారని అన్నారు. మాకు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోవడమే కారణం అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ప్రచారం చేసి.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయన్నారు.