మెదక్‌లో రూ.450 కోట్లతో.. ఐటీసీ ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభం
ITC opens Rs 450 crore food manufacturing facility in Medak. జనవరి 30 సోమవారం మెదక్‌లో ఐటీసీ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్
By అంజి Published on 31 Jan 2023 10:08 AM ISTజనవరి 30 సోమవారం మెదక్‌లో ఐటీసీ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ సదుపాయాన్ని ప్రారంభించడంతో తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఊపందుకుంది. దాదాపు 59 ఎకరాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యం నిర్మించబడింది. 6.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టారు. ఈ సదుపాయం దశలవారీగా ఆశీర్వాద్ అట్టా, సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, బింగో చిప్స్, యిప్పీ నూడుల్స్‌తో సహా ఐటీసీ ఫుడ్స్ బ్రాండ్‌లను ఉత్పత్తి చేస్తుంది.
తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్, ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి సమక్షంలో ఈ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయం, సేవలు, తయారీ రంగాల్లో ఐటీసీ తన పాద ముద్రను పటిష్టం చేసుకుంటోందని పూరి చెప్పారు. కంపెనీ పేపర్‌బోర్డ్ వ్యాపారానికి తెలంగాణ కేంద్రంగా ఉందని, భద్రాచలంలో ఐటీసీ భారతదేశంలోనే అతిపెద్ద పేపర్‌బోర్డ్ సదుపాయాన్ని కలిగి ఉందని ఆయన తెలిపారు. పూరి మాట్లాడుతూ.. "హైదరాబాద్ మా రెండు అత్యుత్తమ లగ్జరీ హోటల్స్, ఐటీసీ కాకతీయ, ఐటీసీ కోహినూర్‌లకు కూడా ఆతిథ్యం ఇస్తోంది" అని అన్నారు.
మెదక్‌లో రెండో దశ తయారీ కేంద్రం పూర్తయితే మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుందని చెప్పారు. ఈ ప్లాంట్ స్థిరమైన వ్యవసాయ-విలువ గొలుసులలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. మెదక్ యూనిట్ దాని రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ మాడ్యూల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్లీన్ ఎనర్జీ ద్వారా శక్తిని పొందుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా ప్లాటినం-స్థాయి గ్రీన్ బిల్డింగ్‌గా ధృవీకరించబడిన ఈ కర్మాగారం శాస్త్రీయంగా రూపొందించబడిన వర్షపు నీటి సేకరణ వ్యవస్థను కలిగి ఉంది. భూగర్భజలాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తద్వారా పర్యావరణంపై యూనిట్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
మెదక్ ఫెసిలిటీలో వర్క్‌ఫోర్స్ కంపోజిషన్ మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఐటీసీ ప్రయత్నానికి అనుగుణంగా ఉంటుంది. ఈ సదుపాయం మొత్తం ఫ్యాక్టరీ స్థాయిలో 50 శాతం మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది.
కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 10 వేల ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేస్తోందని, గజ్వేల్‌లో 1400 ఎకరాలకు పైగా జోన్ రాబోతోందని అన్నారు.