పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్‌

ఖమ్మంలోని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

By అంజి
Published on : 9 Nov 2023 2:23 AM

IT raids, Congress leader, Ponguleti Srinivasa Reddy, Telangana

పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్‌

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మంలోని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన అధికారులు ఖమ్మంలోని ఆయన ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. భారీగా నగదు ఉందన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. పొంగులేటి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఐటీ రైడ్స్‌ నేపథ్యంలో అనుచరులు భారీగా ఆయనకు మద్దతుగా ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంతో పాటు ఆయనకు చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా పొంగులేటి ఇవాళ నామినేషన్‌ వేయనున్నారు. పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొంగులేటి పోటీ చేస్తున్నారు. కాగా త్వరలో తనపై ఐటీ రైడ్స్‌ జరుగుతాయని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. తనపై, తన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతాయని పొంగులేటి కామెంట్స్ చేశారు. ఆయన చెప్పినట్టే తెల్లవారుజామునే అధికారులు రావడం గమనార్హం

Next Story