కొలువుల జాతర.. త్వరలో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది.
By అంజి
కొలువుల జాతర.. త్వరలో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 27 పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 14 వేలు, ఇంజినీర్ల పోస్టులు 2 వేలు, గ్రూప్ 3, గ్రూప్‌లో 1000, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 7 వేల జీపీవో పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ 3, 4 సిలబస్, క్వాలిఫికేషన్ ఒకటే కావడంతో రెండింటికీ ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. గ్రూప్3 కింద రిక్రూట్ అయ్యేవాళ్లు హెచ్‌వోడీ కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా, గ్రూప్4 కింద రిక్రూట్ అయ్యేవాళ్లు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎస్టీ వర్గీకరణ పూర్తి కావడంతో కొలువుల భర్తీపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్‌లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. మేలో గ్రూప్ -2 నోటిఫికేషన్, జులైలో గ్రూప్3 నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను షెడ్యూల్ చేయగా.. ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీ కరణ పూర్తైంది. దీంతో త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి, జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేయనున్నది.