ఇవేం వెర్రి పనులు, ఏదో ఘనత సాధించినట్లు..సజ్జనార్ ఫైర్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ మరోసారి ఆసక్తికర పోస్టును ఎక్స్ వేదికగా చేశారు.

By Knakam Karthik  Published on  13 Feb 2025 9:39 AM IST
Telugu News, IPS officer Sajjanar, Valentines Day,

ఇవేం వెర్రి పనులు, ఏదో ఘనత సాధించినట్లు..సజ్జనార్ ఫైర్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ మరోసారి ఆసక్తికర పోస్టును ఎక్స్ వేదికగా చేశారు. ఆ వీడియోలో ఇద్దరు ప్రేమికుల జంట బైక్ పై వెళుతూ రోడ్డుపై ప్రమాదకర స్థాయిలో స్టంట్స్ చేయడం చూడవచ్చు. కాగా ఈ వీడియోపై సజ్జనార్ స్పందిస్తూ.. ఇలా రాసుకొచ్చారు. 'వాలంటైన్ డే' పేరుతో ఇవేమి వెర్రి పనులు.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి. అతి వేగంతో ప్రమాదకర రీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం డేంజర్. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకుని.. మీ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేయకండి. అని ఐపీఎస్ అధికారి సజ్జనార్ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారిగా ఉన్న సజ్జనార్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పలు మోసాలు, అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలపై నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పెరిగిపోయిన సైబర్ నేరాలను ప్రోత్సహించే సోషల్ మీడియా ప్రభావితం చేసే వారి ఆటలు కట్టిస్తూ.. యువతను మోసగాళ్ల వలలో చిక్కకుండా కాపాడుతున్నారు. అలాగే ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు.

Next Story