తెలంగాణలో 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పంపిణీ చేయనుంది. ఇందుకోసం సోమవారం మహిళా సంఘాల అకౌంట్లలో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
తెలంగాణ అంతటా రెండు మూడు దశల్లో వడ్డీ లేని రుణాలు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయని, గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని రద్దు చేసింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము దానిని భారీ స్థాయిలో తిరిగి ప్రారంభించాము. ఈ చొరవ రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని పెంపొందించింది" అని భట్టి విక్రమార్క అన్నారు.