జూన్ 14న తెలంగాణకు రుతుపవనాలు.. అప్పటి వరకు తీవ్ర ఎండలు
కొనసాగుతున్న వేసవిలో శుక్రవారం అత్యంత వేడి రోజుగా మారింది. నిన్న హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో 43 డిగ్రీల సెల్సియస్,
By అంజి Published on 3 Jun 2023 3:30 AM GMTజూన్ 14న తెలంగాణకు రుతుపవనాలు.. అప్పటి వరకు తీవ్ర ఎండలు
హైదరాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేసవిలో నిన్నటి రోజు (శుక్రవారం) అత్యంత వేడి రోజుగా మారింది. నిన్న హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో 43 డిగ్రీల సెల్సియస్, జిల్లాల్లో దాదాపు 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్‌లోని డజనుకు పైగా ప్రాంతాల్లో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్, 43 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం కారణంగా పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు శుక్రవారం మూసివేయబడి ఉండటంతో.. అధిక సంఖ్యలో ప్రజలు ఇంట్లోనే ఉండి.. తీవ్రమైన ఎండ నుంచి తప్పించుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల మధ్య, వేడి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి పరిధిలోని ప్రాంతాల్లో గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత చార్మినార్, రామచంద్రపురం (బీహెచ్‌ఈఎల్ ఏరియా)లలో గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్ నుంచి 41.6 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి, నల్గొండలో గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 46.6 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా నమోదయ్యాయి. ఐఎండీ హైదరాబాద్ సూచన ప్రకారం.. రాబోయే కొద్ది రోజులు తెలంగాణలో విపరీతమైన వేడి కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే జూన్ 14 వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు.