సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ అంటూ ఊబిలోకి దిగి బంగారు భవిష్యత్తును అంతం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయస్సు.. అది ప్రేమో లేక ఆకర్షణో తెలియని ఆ వయసులో తాము ప్రేమించుకుంటున్నామంటూ తెగించి తల్లిదండ్రులకు ఎదురు చెప్తున్నారు. కొన్ని సంద ర్భాల్లో అయితే ఏకంగా తల్లిదండ్రులను అంతం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తెలిసి తెలియని వయసు లో పుట్టిన ఈ ప్రేమ కోసం మైనర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. ఒకే వీధిలో నివాసముంటున్న బాలిక, బాలుడి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరు ప్రతిరోజు చట్టా పట్టాలేసుకుంటూ ఊరంతా తిరిగే వారు. ఇటీవల ఓ ప్లేస్‌లో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకున్నారు... అంతటితో ఆగలే దండోయ్ ఈ మైనర్లు... ఈ తతంగాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
ఆ తర్వాత వారు ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇంకే ముంది వీడియో కాస్త వైరల్ అయింది. దీంతో ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు విషయం కాస్త తెలిసింది. దీంతో రెండు కుటుంబాల వైపులా గొడవ ప్రారంభమైంది. ఒకే వీధిలోని వారు రెండు వర్గాలుగా విడిపోయి హోరా హోరినా గొడవపడ్డారు. మారణ ఆయుధాలు తీసుకుని మరీ దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో కనీసం 50 మంది వరకు గాయపడినట్లు సమాచారం. ఈ విషయం కాస్త తెలియగానే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన వరంగల్ నగర కేంద్రంలోని కొత్త వాడలో నిన్న రాత్రి సమయంలో చోటుచేసుకుంది.