Hyderabad: 'మా సమస్యను పట్టించుకోరు'.. నిజాం కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన

బషీర్‌బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థులు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.

By అంజి  Published on  8 Aug 2024 2:57 PM IST
Innovative protest, Nizam College, students, hostel

Hyderabad: 'మా సమస్యను పట్టించుకోరు'.. నిజాం కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన

హైదరాబాద్‌: బషీర్‌బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థులు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా వీరి బాధను సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు అందరూ కలిసి వినత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా డిగ్రీ విద్యార్థులు గర్ల్స్ హాస్టల్ లో 100% అడ్మిషన్లు కేవలం డిగ్రీ విద్యార్థినిలకే కేటాయించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో డిగ్రీ విద్యార్థుల కోసం 2022లో నిర్మించినట్లు విద్యార్థులు తెలిపారు. ఆ ఏడాది డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు.

కానీ ఈ ఏడాది డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లు ఎక్కువగా వచ్చాయని తమకే పూర్తిస్థాయిలో హాస్టల్లో అడ్మిషన్లు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు వినూత్నంగా కాలేజీ ఆవరణంలో వంట మార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం.. అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ ఒప్పుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. ప్రిన్సిపాల్ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.

Next Story