పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సులను పట్టించుకోకుండా అవార్డులను ప్రకటించారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధ్యానత కల్పిస్తూ, తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండటం చూస్తుంటే, తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుర్తింపు లేనట్లుగా ఉందనిపిస్తుందని విమర్శించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తోన్న తెలంగాణ రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయమని అన్నారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో వారికి వైర్యం ఉందేమోనన్న ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నా కూడా.. తమ సిఫార్సులను పట్టించుకోవడం పట్ల తప్పుబడుతున్నట్లు మాట్లాడారు. బీజేపీ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. రానున్న బడ్జెట్‌లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలని.. విభజన హామీలు, తెలంగాణ ప్రజలు కూడా పన్నులు చెల్లిస్తున్నారని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన ట్యాక్స్‌లు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేబినెట్ మినిస్టర్లపై ఉందని ఆయన అన్నారు.