ఆ మెనూలో వంటకాలకు ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పేర్లు..!
భారత వైమానిక దళం తన 93వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 8న అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ సమయంలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడ్డా.
By - Medi Samrat |
భారత వైమానిక దళం తన 93వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 8న అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ సమయంలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, అయితే వీటన్నింటి మధ్య ఎయిర్ ఫోర్స్ డే డిన్నర్ పార్టీ మెనూ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఈ డిన్నర్‌లో వడ్డించిన వంటకాల పేర్లు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నందున డిన్నర్ మెనూ వైరల్ అవుతోంది.
ఈ మెనూకి 93 ఇయర్స్ ఆప్ IAF : ఇన్‌ఫాల్బుల్, ఇంపెర్వీయస్, ప్రెసిస్ అని పేరు పెట్టబడింది. అంటే '93 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. తప్పుపట్టలేనిది, అభేద్యమైనది, ఖచ్చితమైనది అని దీని అర్ధం.
ఈ మెనూలోని అన్ని వంటకాలకు ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పేరు పెట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలోని వంటకాల పేర్లు ప్రజలను నవ్వించాయి. ఈ విందులోని వంటకాల పేర్లు ఇలా ఉన్నాయి..
మెను
రావల్పిండి చికెన్ టిక్కా మసాలా
రఫీకి రహ్రా మటన్
భోలారి పనీర్ మేథీ క్రీమ్
సుక్కుర్ షామ్ సవేరా కోఫ్తా
సర్గోధా దాల్ మఖానీ
జాకోబాబాద్ డ్రై ఫ్రూట్ పులావ్
బహవల్పూర్ నాన్
డిజర్ట్స్
బాలకోట్ తిరమిసు
ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా
మురిద్కే మీతా పాన్
ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
ఆపరేషన్ సింధూర్ సమయంలో వైమానిక దళం లక్ష్యంగా చేసుకున్న నగరం లేదా సైట్ పేరు మీద ప్రతి వంటకం పేరు పెట్టబడింది. మే 7 న భారత సాయుధ దళాలచే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించబడింది. ఈ సమయంలో పాకిస్తాన్, పిఓకెలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని న్యూస్ మీటర్ ధృవీకరించనప్పటికీ.. నిన్న ఎయిర్ ఫోర్స్ డే గ్రాండ్ ప్రోగ్రామ్ తర్వాత ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.