Independence day: 34 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ లభించాయి.
By అంజి Published on 14 Aug 2023 12:42 PM ISTIndependence day: 34 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ లభించాయి. స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకు చెందిన 34 మంది పోలీసు సిబ్బందికి వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ ఒక సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 229 మందికి, రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ విశిష్ట సేవ 82 మందికి, 642 మంది పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్ లభించింది.
230 గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 125 మంది సిబ్బంది, జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 71 మంది సిబ్బంది, నార్త్ ఈస్ట్ రీజియన్ నుండి 11 మంది సిబ్బంది ఇవ్వబడ్డాయి. ఇది వారి సాహసోపేతమైన చర్య కోసం ప్రదానం చేస్తున్నారు. గ్యాలంట్రీ అవార్డులు అందుకున్న సిబ్బందిలో 28 మంది సీఆర్‌పీఎఫ్ నుండి, 33 మంది మహారాష్ట్ర నుండి, 55 మంది జమ్ము కశ్మీర్ పోలీస్ నుండి, 24 మంది ఛత్తీస్‌గఢ్ నుండి, 22 మంది తెలంగాణ నుండి, 8 మంది ఆంధ్ర ప్రదేశ్ నుండి మిగిలిన ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్‌ల నుండి ఉన్నారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు ప్రెసిడెంట్ విశిష్ట సేవ పురస్కారం లభించింది. ప్రతిభ పురస్కారాలు 10 పోలీసులను వరించాయి. అలాగే మరో 22 మంది పోలీసులకు గ్యాలంటరీ అవార్డులు లభించాయి. గ్యాలంటరీ అవార్దు ఒకరికి మరణానంతరం ప్రకటించారు.
విశిష్ట సేవ ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్
1. విజయ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ
2. మదాడి రమణ కుమార్, ఎస్పీ, తెలంగాణ
మెరిటోరియస్ మెడల్
1. సాయన వెంకట్వార్లు, ASST. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ
2. బండి వేంకటేశ్వర రెడ్డి, ADDL.SP, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ
3. కొమ్మిశెట్టి రామ కృష్ణ ప్రసాద్ రావు, ADDL.SP (అడ్మిన్), తెలంగాణ
4. ఆత్మకూరి వేంకటేశ్వరి, స్క్వాడ్రన్ కమాండర్/ ADDL. ఎస్పీ, తెలంగాణ
5. అండోజు సత్యనారాయణ, ASST. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ
6. కక్కెర్ల శ్రీనివాస్, ASST. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వరంగల్, తెలంగాణ
7. అజెల్ల శ్రీనివాస రావు, RI ఆఫ్ పోలీస్, RR జిల్లా. తెలంగాణ
8. రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో, తెలంగాణ
9. అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ
10. మహంకాళి మధు, ASST. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంట్రీ మెడల్ కోసం అవార్డు పొందినవారి జాబితా- 2023
1. భాస్కరన్ R, IPS SP [PMG
2. K అశోక్ SC/HC PMG
3. కె. సందీప్ కుమార్ JC/PC PMG
4. M కార్తీక్ JC/PC PMG
5. వి మధు IC/PC PMG
6. చ. సంపత్ JC/PC PMG
7. G రమేష్ DAC/RI PMG
8. దివంగత బి సుశీల JC/PC PMG (పోస్టు)
9. T మహేష్ AAC/RSI PMG
10. షేక్ నాగుల్మీరా AAC/RSI PMG
11. కె ఆదినారాయణ SC/HC PMG
12. ఆర్ సునీల్ కుమార్ JC/PC PMG
13. హెచ్ సుకుమార్ JC/PC PMG
14. M కళ్యాణ్ కుమార్ [JC/PC PMG
15. జి శ్రీధర్ JC/PC PMG
16. Ch రవీంద్ర బాబు JC/PC PMG
17. రాథోడ్ రమేష్ JC/PC PMG
18. కె. పురుషోత్తం రెడ్డి ఇన్‌స్పి. PMG
19. తీగల మహేందర్ రావు PC PMG
20. కాగితోజు శివ ప్రసాద్ ఇన్‌స్పి. PMG
21. బండారి కుమార్ SI PMG
22. బక్కెర శివ కుమార్ PC PMG