దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న పలు శ్రీ చైతన్య కాలేజీలలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వ హించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలు విద్యాసంస్థల కార్పోరేట్ ఆఫీసులపై సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు కొనసాగించారు.
శ్రీ చైతన్య విద్యాసంస్థలన్నీ హైదరాబాద్ కేంద్రం గా నడుస్తున్నాయి. ఈ శ్రీ చైతన్య కాలేజీలు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. శ్రీ చైతన్య కాలేజీలన్నీ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేత చేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని లావాదేవీలు జరుపుతున్నట్లుగా గుర్తించారు. శ్రీ చైతన్య కాలేజీలు ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరొక సాఫ్ట్‌వేర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు ఐడెంటిఫై చేశారు.