Telangana: రైతుకు బేడీలు.. జైలు సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
రైతు ఈర్య నాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
By అంజి Published on 13 Dec 2024 8:32 AM ISTTelangana: రైతుకు బేడీలు.. జైలు సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: రైతు ఈర్యా నాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సంగారెడ్డి సెంట్రల్ జైలర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జైలర్ సంజీవ రెడ్డిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రైతుకు గుండెనొప్పి వచ్చిన కూడా బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతుకు వేసిన బేడీల వ్యవహారంపై విచారణ జరపాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ నాలుగు గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు.
జైల్ అధికారుల తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లుగా అధికారులు తేల్చారు. ఈర్యానాయక్‌ను జైలు నుండి ఆస్పత్రికి తరలించే క్రమంలో అధికారులు ముందస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా.. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈర్యా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా లేడని, బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. జైలు అధికా రులు ఉద్దేశపూర్వ కంగా చేశారా... పొరపాటుగా జరిగిందా అనే కోణంలో పోలీసులు కొనసాగించారు. ఈ రోజు ఉదయం A2 సురేష్ జైల్లో వ్యవహరించిన తీరుతో అనుమానం మరింత పెరిగింది.
అయితే సురేష్ ఈరోజు 9 గంటల ప్రాంతంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడారు. ఈర్య నాయక్ కు గుండె నొప్పి వచ్చింది.లాయర్లు, మీడియాకి సమాచారం ఇస్తే గంటలో బైయిల్ వస్తుందని సురేష్ ఫోన్ లో చెప్పారు. సురేష్ ఎవరితో మాట్లాడరన్న దానిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈర్యా నాయక్‌కు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా ఆదేశాలు జారీ చేశారు.