తెలుగు రాష్ట్రాల్లో చలి పులి వణికిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాబోయే నాలుగు రోజుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల చలిగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాల్లో కూడా చలిగాలుల ప్రభావంతో ఉదయం వేళల్లో రోడ్లపై దట్టమైన పొగమంచుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. మరోవైపు రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ఇబ్బందులు పడుతున్ఆనరు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరుకులో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని బట్టి తదుపరి ఆదేశాలు ఇస్తామని చెప్పారు.