హైదరాబాద్: నేటి నుంచి ఇసుక 24 గంటల ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్‌లు, డంపింగ్ యార్డుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక లోడ్ లారీలను అనుమతించవద్దని సూచించారు. ఈ మేరకు గనుల శాఖ ఏడీలు, డీడీలు, టీజీఎండీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లో గురువారం నాడు ఇసుక సరఫరాపై వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది.
వివిధ ప్రాజెక్టులకు ఇసుక వినియోగంపై వివరాలను మార్చి 31 లోపు సమర్పించాలని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, టీజీఎంఎస్‌ఐడీసీ, సాగునీటి, పంచాయతీరాజ్ శాఖలను కోరారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌కు నెలవారీగా కావాల్సిన ఇసుకపైనా వివరాలు అందించాలని సూచించారు. అటు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఇల్లీగల్ ఇసుక దందాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.