నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో.. మండుతున్న వంటనూనె ధరలు

In Nizamabad and Kamareddy districts, traders are selling cooking oil at high prices. రష్యా దాడి లక్ష్యం ఉక్రెయిన్ ప్రజలను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

By అంజి  Published on  8 March 2022 5:19 AM GMT
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో.. మండుతున్న వంటనూనె ధరలు

రష్యా దాడి లక్ష్యం ఉక్రెయిన్ ప్రజలను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత దేశంలోని ప్రతి ఇంటిని నిత్యావసర వస్తువుల ధరలు హడలెత్తిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి కారణమంటూ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వ్యాపారులు వంటనూనెల ధరలను పెంచేశారు. వంటనూనెల ధరలు లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా వంట నూనెల ధరలు గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్నాయి, అయితే అవి గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. మార్చి నెలకు సంబంధించిన నిత్యావసర వస్తువుల జాబితాతో కిరాణా దుకాణాలను సందర్శించిన వినియోగదారులు వంటనూనె ధరలను చూసి షాక్‌కు గురయ్యారు.

ఒక అంచనా ప్రకారం.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపు 53 లక్షల లీటర్ల వంటనూనె అన్ని అవసరాలకు వినియోగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో యుద్ధానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరుకు రూ.135, పామాయిల్ లీటర్ రూ.119, వేరుశనగ రూ.165గా ఉంది. వ్యాపారులు సాధారణంగా ప్యాకెట్‌పై ముద్రించిన ఎంఆర్‌పి కంటే లీటరుకు రూ.10 తక్కువగా విక్రయిస్తారు. అయితే యుద్ధం మొదలైనప్పటి నుండి, యుద్ధం కారణంగా చెబుతూ ఎంఆర్‌పీ ధర కంటే లీటరు ఎడిబుల్ ఆయిల్‌పై 10 నుండి 25 రూపాయల వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

యుద్ధానికి ముందు దిగుమతి చేసుకున్న ఎడిబుల్ ఆయిల్ ఇప్పటికీ గోదాముల్లోనే ఉంది. గోదాముల్లో నిల్వ ఉంచిన సరుకుల ధరలను వ్యాపారులు అక్రమంగా పెంచి విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వంటనూనెలను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం లీటర్ పామాయిల్ ధర రూ.135 ఉండగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.160కి విక్రయిస్తున్నారు. వేరుశనగ నూనె ధర కొద్ది రోజుల క్రితం లీటరు రూ.165 ఉండగా ప్రస్తుతం ఎంఆర్‌పీ రూ.175కి చేరింది.

Next Story